Brand new Course Package released! Get 30% off your first purchase with code “Eduma”. Find out more!

పాస్ పోర్టు దరఖాస్తుల ధ్రువీకరణలో దేశంలో రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ పోలీస్..!

  • అత్యంత వేగంగా పాస్ పోర్టు దరఖాస్తులను ధ్రువీకరించడంలో తెలంగాణ పోలీసులు దేశంలో కర్ణాటక తర్వాత రెండో స్థానంలో నిలిచారు. ఇందు కోసం రాష్ట్ర పోలీసులు ఉపయోగిస్తున్న వెరీఫాస్ట్ యాప్ జాతీయస్థాయిలో ద్వితీయ బహుమతి దక్కించుకుంది.
  • పాస్ పోర్టు సేవాదివస్ సందర్భంగా జూన్ 24 న దిల్లీలోని కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రాంతీయ పాస్ పోర్టు అధికారుల సదస్సులో ఆ శాఖ సహాయమంత్రి పబిత్ర మార్గరీటా చేతుల మీదుగా తెలంగాణ ఇంటెలిజెన్స్ విభాగం డైరెక్టర్ జనరల్ బి. శివధర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
  • ఈ కార్యక్రమంలో ప్రథమ బహుమతిని కర్ణాటక పోలీసులు అందుకున్నారు.
  • ప్రజానుకూల విధానాల అమలులో హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయానికి అవార్డు..!
  • పాస్ పోర్టు సేవల కోసం వచ్చే ప్రజలకు అనుకూలమైన విధానాల అమలులో హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయానికి జాతీయస్థాయి అవార్డు దక్కింది.
  • దిల్లీ లోని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ కార్యాలయంలో జరుగుతున్న ప్రాంతీయ పాస్పోర్టు అధికారుల సదస్సులో జూన్ 24 న ఆ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గరీటా చేతులమీదుగా హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి జొన్నలగడ్డ స్నేహజ ఈ పురస్కారాన్ని స్వీకరించారు.
  • 2024-25లో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, ప్రజా కేంద్రీకృత విధానాల అమలుకుగాను ఈ అవార్డు అందజేశారు.
  • 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్మారక పాస్ పోర్ట్ ఎన్వలప్ విడుదల చేసింది. ఇదే సందర్భంగా తెలంగాణ గవర్నర్ చేతులమీదుగా సంవత్సరం పొడవునా నడిచే ఆర్ట్ అండ్ క్యాలీగ్రఫీ ఎగ్జిబిషను ప్రారంభించింది. సైబర్ అవగాహన ప్రచార కార్యక్రమాలు, వైద్య ఆరోగ్య శిబిరాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలతో అనుసంధానం కావడం, వాననీటి సంరక్షణ లాంటి కార్యక్రమాలను ఈ కార్యాలయం చేపట్టింది

Tags:

Share:

Book Your Seat

Please enable JavaScript in your browser to complete this form.

Book Your Seat Now!

Please enable JavaScript in your browser to complete this form.