Brand new Course Package released! Get 30% off your first purchase with code “Eduma”. Find out more!

సైబర్ నేరాల నియంత్రణకు ఒక్కరోజే 546 అవగాహన సదస్సులు..!

  • జులై 2 న ‘సైబర్ జాగరూక్తా దివాస్’లో భాగంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) రాష్ట్రవ్యాప్తంగా జులై 2 న ఒక్కరోజే 546 ప్రాంతాల్లో అవగాహన కల్పించినట్లు టీజీసీఎస్బీ ప్రకటించింది.
  • ఈ అవగాహన కార్యక్రమాల్లో సైబర్ నేరాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపై పోలీస్ బృందాలు ప్రజలకు వివరించాయి.
  • వీటిలో భాగంగా పార్ట్-టైం మీషో ఫ్రాడ్స్, పీఎం-కిసాన్ ఫేక్ ఏపీకే ఫ్రాడ్స్, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎస్బీ వాటర్ బిల్ డిస్కనెక్షన్ స్కామ్ తదితర సైబర్ మోసాల గురించి అవగహన కల్పించారు.
  • సైబర్ నేరాల బారిన పడితే 1930 నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఈ సంధర్భంగా ప్రజలకు పోలీస్ శాఖ తెలిపింది.

సైబర్ జాగరూక్తా దివస్:

  • భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా మొదటి బుధవారం నాడు “సైబర్ జాగరూక్తా దివస్” (సైబర్ అవగాహన దినోత్సవం) నిర్వహించబడుతుంది. జూలై 2, 2025 (బుధవారం) నాడు కూడా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా జరుపుకున్నారు.
  • డిజిటల్ ఇండియా విస్తరిస్తున్న నేపథ్యంలో, ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి, ప్రజలలో డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

లక్ష్యాలు:

“సైబర్ జాగరూక్తా దివస్” కింది ప్రధాన లక్ష్యాలతో నిర్వహించబడుతుంది.

  • ప్రజలలో అవగాహన: సామాన్య ప్రజలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రైవేట్ సంస్థల సిబ్బందికి సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం.
  • సైబర్ పరిశుభ్రత (Cyber Hygiene): సురక్షితమైన పాస్‌వర్డ్‌లు, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్, సురక్షిత బ్రౌజింగ్ పద్ధతులు వంటి మంచి అలవాట్లను ప్రోత్సహించడం.
  • నివారణ చర్యలు: ఆన్‌లైన్ మోసాలు, ఫిషింగ్ ఎటాక్స్, మాల్‌వేర్, రాన్సమ్‌వేర్ వంటి వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం.
  • రిపోర్టింగ్ మెకానిజం: ఎవరైనా సైబర్ నేరానికి గురైతే, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (www.cybercrime.gov.in) లేదా హెల్ప్‌లైన్ నంబర్ 1930 ద్వారా ఎలా ఫిర్యాదు చేయాలో తెలియజేయడం.
  • సమన్వయం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, చట్ట అమలు సంస్థలు, విద్యాసంస్థలు మరియు ప్రైవేట్ రంగం మధ్య సమన్వయం సాధించి, సైబర్ భద్రతా చర్యలను బలోపేతం చేయడం.

Tags:

Share:

Book Your Seat

Please enable JavaScript in your browser to complete this form.

Book Your Seat Now!

Please enable JavaScript in your browser to complete this form.