- ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ఆహారం లభించే దేశాల జాబితాలో భారతదేశం 12వ స్థానాన్ని దక్కించుకుంది. “అంతర్జాతీయ ఉత్తమ ఆహార సూచిక” వివరాలు గ్లోబల్ ప్రైవేట్ ట్రావెల్ గైడ్ సంస్థ ‘టేస్ట్ అట్లాస్’ 2024-25 ద్వారా వెల్లడించాయి.
- ఈ ర్యాంకింగ్‌లు దేశాలు మరియు నగరాల్లో లభించే ఆహార నాణ్యత, వైవిధ్యం, మరియు వినియోగదారుల రేటింగ్‌ల ఆధారంగా రూపొందించబడ్డాయి.
- ఈ ర్యాంకింగ్‌లు Taste Atlas డేటాబేస్‌లోని 17,073 నగరాల నుండి, 15,478 ఆహార వస్తువులకు 477,287 చెల్లుబాటు అయ్యే ఆహార రేటింగ్‌ల ఆధారంగా రూపొందించబడ్డాయి.
- ఈ జాబితాలు స్థానిక వంటకాలు మరియు సంస్కృతుల అంతర్జాతీయ గుర్తింపును ప్రతిబింబిస్తాయి.
ప్రపంచంలో ఉత్తమ వంటకాలు (2024-25):
ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన దేశాలు.
- గ్రీస్ (Greece) – 4.60 రేటింగ్
- ఇటలీ (Italy) – 4.59 రేటింగ్
- మెక్సికో (Mexico) – 4.52 రేటింగ్
- స్పెయిన్ (Spain)
- పోర్చుగల్ (Portugal)
- టర్కీ (Turkey)
- ఇండోనేషియా (Indonesia)
- ఫ్రాన్స్ (France)
- జపాన్ (Japan)
- చైనా (China)
- పోలాండ్ (Poland)
- భారతదేశం (India) – 4.4 రేటింగ్
- అమెరికా (USA)
- పెరూ (Peru)
- సెర్బియా (Serbia)
భారతదేశంలో ప్రసిద్ధ వంటకాలుగా రోటి, నాన్, చట్నీ, బిర్యానీ, దాల్, బటర్ చికెన్, తందూరి చికెన్ వంటివి టేస్ట్ అట్లాస్ జాబితాలో ఉన్నాయి.
ప్రపంచంలో ఉత్తమ ఆహార నగరాలు (2024-25):
ఈ జాబితాలో భారతదేశం నుంచి ఆరు నగరాలకు చోటు దక్కింది, అందులో ముంబై టాప్ 5లో ఉంది.
- నేపుల్స్ (Naples), ఇటలీ (పిజ్జా మార్గెరిటా) – 4.8 రేటింగ్
- మిలన్ (Milan), ఇటలీ (రిసోట్టో అల్లా మిలానీస్)
- బోలోగ్నా (Bologna), ఇటలీ (టాగ్లియెటెల్ అల్ రాగు)
- ఫ్లోరెన్స్ (Florence), ఇటలీ (బిస్టెక్కా అల్లా ఫియోరెంటినా)
- ముంబై (Mumbai), భారతదేశం (వడా పావ్) – 4.5 రేటింగ్
జాబితాలో ఉన్న ఇతర భారతీయ నగరాలు:
43. అమృత్‌సర్ (Amritsar) (అమృత్‌సరి కుల్చా)
45. న్యూ ఢిల్లీ (New Delhi) (బటర్ చికెన్/ముర్గ్ మఖనీ)
50. హైదరాబాద్ (Hyderabad) (హైదరాబాదీ బిర్యానీ)
హైదరాబాద్‌కు బిర్యానీతో పాటు పెసరా దోస, చికెన్ 65, కరాచి బిస్కట్, ఇడ్లీ కూడా సిఫార్సు చేయబడ్డాయి. ITC కోహినూర్, కరాచి బేకరీ, జ్యువెల్ ఆఫ్ నిజాం వంటివి హైదరాబాద్‌లో సిఫార్సు చేయబడిన రెస్టారెంట్లు.
71. కోల్‌కతా (Kolkata) (రసగుల్లా)
75. చెన్నై (Chennai) (దోస)
చెన్నైలో దోసతో పాటు ఇడ్లీ, చికెన్ 65, రుమాలి రోటి, సాంబార్ వంటివి కూడా సిఫార్సు చేయబడ్డాయి.